Tuesday, November 10, 2009

ఒక రాత్రి

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను


ఆకాశపు టెడారి నంతటా, అకట
ఈ రేయి రేగింది ఇసుక తుపాను
గాలిలో కనరాని గడుసు దెయ్యాలు
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము
కరి కలేబరములా కదలదు కొండ
ఆకాశపు టెడారిలో కాళ్ళు తెగిన
వొంటరి వొంటేలగుంది జాబిల్లి
విశ్వమంతా నిండి, వేలిబూదివోలె
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను

No comments:

Post a Comment